: మహిళల వన్డే ప్రపంచ కప్: 186 పరుగులతో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం


డెర్బీలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్ పై భారత్ విజయ దుందుభి మోగించింది. దీంతో సెమీస్ లోకి అడుగుపెట్టింది. మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. న్యూజిలాండ్ ముందు 266 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా సారథి మిథాలీ రాజ్‌ 123 బంతుల్లో 11 ఫోర్లతో 109 పరుగులు చేసింది. టీమిండియా ఇత‌ర బ్యాట్ ఉమెన్‌ల‌లో వేద కృష్ణమూర్తి 70, కౌర్ 60 ప‌రుగులను బాదారు. దీంతో భార‌త్... కివీస్ ముందు ఇంత‌టి ల‌క్ష్యాన్ని ఉంచ‌గ‌లిగింది.

అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జ‌ట్టు వికెట్ల‌ను వెనువెంట‌నే తీస్తూ భార‌త బౌలర్లు అద్భుతంగా రాణించారు. న్యూజిలాండ్ బ్యాట్స్ ఉమెన్‌ల‌లో ఎవ్వ‌రూ చెప్పుకోత‌గ్గ స్కోరు చేయ‌లేదు. క్రీజులోకి వ‌చ్చిందే ఆల‌స్యం అన్న‌ట్లు వెనుదిరిగిపోయారు. 25.3 ఓవ‌ర్ల‌లో 79 ప‌రుగుల‌కే న్యూజిలాండ్ ఆలౌట్ అయింది. దీంతో 186 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.  టీమిండియా సారథి మిథాలీ రాజ్ పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. 

  • Loading...

More Telugu News