: డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులను రహస్య ప్రాంతానికి తరలించిన పోలీసులు!
హైదరాబాద్‌లో కలకలం రేపుతోన్న డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ రోజు జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అనంతరం వారిని హైదరాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ కాసేపు విచారణ జరిపిన అధికారులు ప్రస్తుతం వారిని రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ సహా కుందన్, వాహిద్‌లను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారించనున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు మొత్తం 14 మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మిగతా నిందితులను కూడా పోలీసులు ఈ కేసు విషయమై ఆరా తీస్తున్నారు.