: సరిహద్దులో భారీస్థాయిలో కాల్పులకు తెగబడ్డ పాక్ రేంజర్లు!


పాకిస్థాన్ మ‌రోసారి రెచ్చిపోయింది. భార‌త సైన్యం చేతిలో ఎన్నిసార్లు దెబ్బ‌తిన్నా పాక్ రేంజ‌ర్లు త‌మ బుద్ధిని మార్చుకోవ‌డం లేదు. ఈ రోజు జ‌మ్ముక‌శ్మీర్‌లోని రాజౌరీ మంజ‌కోటే ఎల్ఓసీ వ‌ద్ద పాక్ రేంజ‌ర్లు మరోసారి భారీస్థాయిలో కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డారు. పాక్ జవాన్ల కాల్పులతో సరిహద్దులో మ‌రోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ఆర్మీ విచక్షణారహితంగా మోటార్ షెల్లింగ్ ల‌తో దాడికి   పాల్పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. కాగా, ఫూంజ్ జిల్లా బాల‌క‌కోట్ సెక్టార్‌లోనూ పాక్ రేంజ‌ర్లు కాల్పుల‌కు తెగబడ్డారు. మ‌రోవైపు, ఈ రోజు ఉద‌యం నుంచి జ‌మ్ముక‌శ్మీర్‌లోని కుల్గాంలో పెట్రోలింగ్ నిర్వ‌హిస్తోన్న పోలీసులు, సీఆర్పీఎఫ్ బ‌ల‌గాల‌పై ఉగ్ర‌వాదులు గ్ర‌నేడ్ దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News