: పెరిగిన బంగారం, వెండి ధరలు
కొన్ని రోజులుగా నేల చూపులు చూస్తూ వచ్చిన పసిడి ధర ఈ రోజు పైకి ఎగబాకింది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.190 పెరిగి, 29,050గా నమోదైంది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించి, రూ.38వేల మార్కును దాటింది. నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర పెరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్‌లోనూ ఈ రోజు పసిడి ధర 0.91శాతం పెరిగి ఔన్సు 1,228.40 డాలర్లుగా నమోదైంది.