: కలెక్టర్ తో వివాదం తర్వాత తొలిసారి సచివాలయానికి వచ్చిన ఎమ్మెల్యే శంకర్‌నాయక్
కలెక్టర్ ప్రీతిమీనాతో దురుసుగా ప్రవర్తించి విమర్శలు ఎదుర్కున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై టీఆర్ఎస్ అధిష్ఠానం ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వివాదం జరిగిన అనంతరం సదరు ఎమ్మెల్యే తొలిసారిగా సచివాలయానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి చర్చిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను కలిసేందుకు ఆసక్తి చూపకపోతుండడంతో ఆయనను కలిసే అంశంపైనే ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై కూడా ఐఏఎస్ అధికారులు నిన్న సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ముత్తిరెడ్డి కూడా కడియం శ్రీహరిని కలిసి అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ను కలిసి చర్చించారు.