: బుట్టా రేణుక గురించి జరుగుతున్న ప్రచారం సరైంది కాదు: ఎంపీ మేకపాటి
వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు జోరందుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు జగన్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కూడా ఆమె హాజరుకాలేదు. దీంతో, ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ వార్తలను ఖండించారు. టీడీపీలోకి బుట్టా రేణుక చేరబోతున్నారనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. నారా లోకేష్ రాష్ట్ర మంత్రి కనుకనే ఆయనను రేణుక కలిశారని వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసం మంత్రులతో ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కలవడం సహజమేనని చెప్పారు. తాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును చాలా సార్లు కలిశానని అన్నారు.