: డ్రగ్స్ వ్యవహారంలో మా పిల్లలు రానా, అభిరామ్ లను ఇరికించాలని చూస్తున్నారు: నిర్మాత దగ్గుబాటి సురేష్


డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ ను వణికిస్తోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు పొక్కుతుందో అని పరిశ్రమలోని వారు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఇప్పటికే పేర్లు బయటకు వచ్చిన వారు... ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. మరోవైపు, బడా నిర్మాతల కుమారులు కూడా ఈ వ్యవహారంలో ఉన్నారనే వార్తలతో టాలీవుడ్ ఉలికిపాటుకు గురవుతోంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఓ ఆంగ్లపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డ్రగ్స్ వ్యవహారంతో తన కుమారులు రానా, అభిరామ్ లకు ఎలాంటి సంబంధం లేదని... దయచేసి ఈ వ్యవహారంలోకి తమను లాగవద్దని విన్నవించారు. కావాలనే కొంత మంది తమను ఇందులోకి లాగే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వివాదంలో రానా, అభిరామ్ లను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని... తమ కుటుంబంలో ఎవరికీ వీటితో సంబంధం లేదని చెప్పారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు రాలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News