: గంటలో 2500 పుష్ అప్‌లు చేసి రికార్డు సృష్టించిన 52 ఏళ్ల వ్యక్తి
ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్‌టన్ విలియమ్స్ అనే 52 ఏళ్ల వ్యక్తి గంటలో 2,500ల పుష్అప్‌లు చేసి తన గిన్నిస్ రికార్డు తానే బ్రేక్ చేశాడు. 2015లో కూడా ఈయన ఒక గంటలో 2,200 పుష్అప్‌లు చేసి ప్రపంచ రికార్డు సాధించినట్లు గిన్నిస్ ప్రతినిధులు తెలిపారు. ఈయన గంటపాటు పుష్అప్‌లు చేస్తున్న వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో చక్కర్లు కొడుతోంది.
అతను గంట సేపు పుష్అప్‌లు చేయడం మాట పక్కన పెడితే, అంత సేపు ఆ వీడియో చూడటమే చాలా కష్టంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చూడటానికే ఇంత కష్టమనిపిస్తే, ఇక వాటిని చేస్తున్న ఆయన పరిస్థితి ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా, ఈ వయసులో ఇంత ఫిట్‌నెస్ ఎలా మెయిన్‌టైన్ చేస్తున్నావయ్యా బాబూ? అంటూ ఆయనపై కురుస్తున్న ప్రశ్నల వర్షం మాత్రం ఆగటం లేదు.