: నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో అకున్ సబర్వాల్ భేటీ
నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులతో ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఈ ఉదయం భేటీ అయ్యారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన పటిష్ఠ చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కొరియర్ సంస్థలపై కూడా నిఘా పెంచాలంటూ నార్కోటిక్ అధికారులకు ఆయన సూచించారు. విదేశాల నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా ఎయిర్ పోర్టుల్లో నిఘాను పటిష్టం చేయాలని ఆదేశించారు. మరోవైపు, డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈ రోజు రెండో జాబితా విడుదలవుతోంది.