: టాలీవుడ్ ప్రముఖుల కొంపముంచింది 'వాట్సాపే'!
టాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం కలకలం రేపుతోంది. రవితేజ లాంటి అగ్రనటుడి పేరు కూడా వెలుగులోకి రావడంతో అందరూ అవాక్కయ్యారు. ఇప్పటికి బయటకు వచ్చింది కొంత మంది పేర్లే... మరో లిస్ట్ తయారవుతోందనే ఎక్సైజ్ అధికారుల వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. అయితే, నోటీసులు అందుకున్న వారంతా డ్రగ్స్ వాడారా? లేదా? అనే విషయాన్ని పక్కనబెడితే... టాలీవుడ్ కొంప ముంచింది మాత్రం వాట్సాపే అని తెలుస్తోంది. డ్రగ్ ముఠాతో వాట్సాప్ ద్వారా జరిపిన సంభాషణలే టాలీవుడ్ ప్రముఖుల కొంపముంచాయట. ఇప్పటి వరకు నోటీసులు అందుకున్న వారితో పాటు వారి డ్రైవర్లు, పీఏలు, సన్నిహితుల పాత్ర కూడా ఇందులో ఉందని తేలింది.