: జగన్! ఇప్పుడే హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదు: ఎంపీ రాయపాటి సలహా
ఇటీవల జరిగిన ప్లీనరీలో హామీలు గుప్పించిన వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు విమర్శలు గుప్పించారు. గుంటూరులో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు తొందర ఎక్కువైందనీ, ఇప్పుడే హామీలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ వంటి వాళ్లే అవినీతి కేసుల నుంచి తప్పించుకోలేకపోతున్నారని, జగన్ లాంటి అవినీతిపరులను కేంద్రం దగ్గరకు చేరదీయదని అన్నారు. ఈ సందర్భంగా రైల్వేజోన్ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రైల్వేజోన్ విషయంలో తాను చెప్పే విషయాలను ఎంపీలు అర్థం చేసుకోవడం లేదని అన్నారు.