: ఆహారం, శృంగారం గురించి అడిగితే షాకిచ్చే సమాధానం చెప్పిన సమంత.. వీడియో మీరూ చూడండి
అందాల నటి, అక్కినేని వారి కాబోయే కోడలు సమంత జేఎఫ్ డబ్ల్యూ మేగజీన్ కవర్ కోసం హాట్ ఫొటో షూట్ లో పాల్గొంది. ఈ షూట్ లో తన అందాలను ఆరబోసి, అభిమానులకు కనువిందు చేసింది. ఈ సందర్భంగా ఓ చిన్న ఇంటర్వూ ఇచ్చిన సమంత పలు విషయాలపై బోల్డ్ గా మాట్లాడింది.
తన హ్యాండ్ బ్యాగ్ ఉండే వస్తువుల్లో నోట్ బుక్, పెర్ఫ్యూమ్, లిప్ స్టిక్, ఫోన్ ఉంటాయని చెప్పింది. తాను చేయాల్సిన పనులను మర్చిపోకుండా ఉండేందుకు నోట్ బుక్ లో అన్నీ రాసుకుంటుంటానని చెప్పింది.
ఆహారం, సెక్స్ లలో ఏది లేకుండా ఉండలేరనే ప్రశ్నకు బదులుగా... వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేయడం కష్టమని అంది. అయితే, తర్వాత సెక్స్ కే ఓటేసింది. తిండి లేకుండా ఓ రోజు ఉండగలనని బోల్డ్ గా సమాధానమిచ్చి, అందర్నీ షాక్ కు గురి చేసింది.
నాగచైతన్యతో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ... నాగ చైతన్యలోని స్థిరత్వం తనకు ఎంతగానో నచ్చిందని చెప్పింది. చై చాలా రొమాంటిక్ అని తెలిపింది. తన కోసం అత్యంత ఖరీదైన డియో బ్యాగ్ ను కొని, దానిపై స్కెచ్ పెన్నులతో రాశాడని... దానిపై ఎంతో క్యూట్ మెసేజ్ రాశాడని... తన కోసం ఎంతో ఇష్టంగా చేసిన ఆ పని తనకు ఎంతో నచ్చిందని... ఆ బ్యాగ్ తనకు ఫేవరెట్ అని చెప్పింది.
ఎంగేజ్ మెంట్ చీర గురించి మాట్లాడుతూ, తన స్నేహితురాలు దాన్ని డిజైన్ చేసిందని చెప్పింది. ఆమె క్రియేటివిటీ తనకు ఎంతో నచ్చుతుందని అంది. ఆమె వెడ్డింగ్ కు ఆమె ఇలాంటి శారీనే డిజైన్ చేసుకుందని తెలిపింది. చైతూతో తనకు మొదటి సినిమా 'ఏం మాయ చేశావో'తో పరిచయం అయిందని... అప్పట్నుంచి అతనితో ప్రేమలో ఉన్నానని చెప్పింది. ఆ తర్వాత ఇద్దరికీ కొన్ని ఎత్తుపల్లాలు వచ్చాయని, ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నామని... చైతూతో తన ప్రయాణం మొత్తాన్ని డాక్యుమెంట్ చేయాలని తాను భావించానని... ఈ చీర ద్వారా దాన్ని ప్రజెంట్ చేయడమే బెస్ట్ అనుకున్నానని తెలిపింది.
మొదట్లో తనకు ఎన్నో కలలు ఉండేవని, ఏదేదో అయిపోవాలని అనుకునేదాన్నని... కానీ, యాక్టర్ కావాలనుకోవడమే తన రైట్ ఛాయిస్ అని చెప్పింది.