: దీపికా ఎండిపోయావు... తినడం మర్చిపోయావా?: అభిమానుల విమర్శలు


ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే అభిమానుల విమర్శలు రుచి చూస్తోంది. 'వానిటీ ఫెయిర్' మ్యాగజీన్ ఫొటో షూట్ కోసం దీపికా మరింత స్లిమ్ గా తయారైంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోల్లో ఒక ఫోటోను దీపిక అభిమానుల కోసం పోస్టు చేసింది. అంతే, దీపిక లుక్ పై అభిమానులు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. 'తినడం మర్చిపోయావా?' అంటూ ఒక అభిమాని అడిగితే... 'అందంగానే ఉండేదానివి కదా? ఏమైంది నీకు?' అంటూ మరో అభిమాని విమర్శించాడు.

'మరీ పుల్లలా ఉన్నావ'ని ఇంకో అభిమాని కామెంట్ చేశాడు. మరో అభిమాని ఒక అడుగు ముందుకు వేసి 'దీపికా! బలవర్థకమైన ఆహారం తీసుకో' అంటూ సలహా ఇస్తూ... ఆమె ఏం తింటే బలం సంతరించుకుంటుందో తెలుపుతూ ఆహారాన్ని కూడా సూచించాడు. కాగా, గతంలో ఒక ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోను ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేయగా 'నీకు సంప్రదాయం తెలియ'దంటూ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News