: న్యూయార్క్ వ‌చ్చిన సెల‌బ్రిటీల‌ను ఈ కుర్రాడు వ‌దిలిపెట్ట‌డు... మీరే చూడండి!


సెల‌బ్రిటీలు క‌నిపిస్తే వారితో సెల్ఫీ దిగ‌డం అభిమానుల‌కు అల‌వాటే. కానీ ఈ కుర్రాడు న్యూయార్క్ వ‌చ్చిన ఏ సెల‌బ్రిటీని వ‌దిలిపెట్ట‌డు. అంద‌రితో సెల్ఫీ దిగుతాడు. ఇత‌ని పేరు రోన‌క్ షా. న్యూయార్క్‌లో సెటిల్ అయిన ప్ర‌వాస భార‌తీయుడు. క్రికెట్‌, సినిమా, టెన్నిస్ ఇలా అన్ని రంగాల సెల‌బ్రిటీల‌తో సెల్ఫీలు దిగి రోన‌క్ త‌న‌ ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేస్తాడు. న్యూయార్క్ వెళ్లిన వారు త‌ప్ప‌కుండా టైమ్స్ స్క్వేర్ చూడ‌టానికి వెళ్తారు. అక్క‌డికి ద‌గ్గ‌ర‌లోనే రోన‌క్ ప‌నిచేసే చోటు ఉండ‌టంతో వ‌చ్చిన ప్ర‌తి సెల‌బ్రిటీతో సెల్ఫీ దిగే అవ‌కాశం దొరుకుతుంద‌ని రోన‌క్ చెబుతున్నాడు. ఒక‌సారి త‌న ఇన్‌స్టాగ్రాం అకౌంట్ చూస్తే అభిమానులు కుళ్లుకోవాల్సిందే!

  • Loading...

More Telugu News