: ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక ఏడ్చేశా.. బ్రిటన్ ప్రధాని థెరెసా మే!
జూన్ 8న జరిగిన స్నాప్ ఎలక్షన్లో ఓటమిని తాను భరించలేకపోయానని, తట్టుకోలేక ఏడ్చేశానని బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు. బీబీసీ రేడియోతో ఆమె మాట్లాడుతూ.. ఫలితాలు వచ్చిన వెంటనే తాను చాలా నిరాశకు గురయ్యానని చెప్పారు. నాశనమై పోయిన భావన కలిగిందన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై చర్చించేందుకు తనకు అండగా నిలవాలని కోరుతూ నిర్వహించిన ఎన్నికల్లో ఆమె అనుకున్న మెజారిటీ సాధించలేకపోయారు. ఆ ఓటమి తనను ఎంతగానో బాధించిందన్న థెరెసా మే ఫలితాలు వచ్చాక వినాశకరమైన భావన వచ్చిందన్నారు. ఆ సమయంలో కన్నీరు కూడా పెట్టుకున్నానని వివరించారు.