: మా హృదయాలను పాలించేది ఈ చిట్టి రాణులే.. గంభీర్ ట్వీట్‌తో మురిసిపోతున్న నెటిజన్లు.. కామెంట్ల వెల్లువ!
మా హృదయాలను పాలించేది ఈ చిట్టి రాణులే.. అంటూ టీమిండియా ఓపెనర్ గౌతం గంభీర్ ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. జూన్ 21న జన్మించిన తమ రెండో బిడ్డకు గౌతమ్ దంపతులు ‘అనైజా’ అని నామకరణం చేశారు. అక్టోబరు 2011లో వివాహం చేసుకున్న గంభీర్‌కు ఇప్పటికే మూడేళ్ల కూతురు ‘ఆజీన్’ ఉంది.
ఇద్దరు కూతుళ్ల ఫొటోలను పోస్ట్ చేసిన గంభీర్ దానికి.. ‘‘ఆజీన్, అనైజా.. మా హృదయాలను పాలిస్తోంది ఈ ఇద్దరే’ అని క్యాప్షన్ తగిలించాడు. అజీన్ ఒడిలో ఉన్న అనైజాను చూసిన అభిమానులు ‘సో క్యూట్’ అంటూ మురిసిపోతున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ సహా క్రికెటర్లందరూ ఈ ఫొటోపై కామెంట్ చేశారు. నెటిజన్లు అయితే బ్రహ్మాండమైన పేర్లు పెట్టారంటూ గౌతమ్‌కు కితాబిస్తున్నారు. కొందరైతే ఆ పేర్లకు అర్థాలు చెప్పాలని కోరుతున్నారు.