: భగ్గుమన్న పాత కక్షలు... టీఆర్ఎస్ కార్పొరేటర్ ను కత్తులతో పొడిచి చంపేసిన దుండగులు!
వరంగల్ కార్పొరేషన్ కు చెందిన టీఆర్ఎస్ కార్పొరేటర్ అనిశెట్టి మురళి ఈ రోజు దారుణ హత్యకు గురయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి కుమార్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చారు. పలువురు దుండగులు వేట కొడవళ్లు, కత్తులతో వచ్చి మురళీపై విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యకు కారణం పాత కక్షలేనని తెలుస్తోంది. ఈ దారుణానికి పాల్పడిన అనంతరం నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ హత్యను చిన్నా గ్యాంగ్ చేసిందని తెలుస్తోంది. మురళికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆయన వరంగల్ నగరపాలక సంస్థలోని 44వ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు.