: బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ ను ఎంపిక చేయడం పట్ల మండిపడ్డ కొత్త కోచ్ రవిశాస్త్రి
బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్‌ను ఎంపిక చేయడం పట్ల టీమిండియా కొత్త కోచ్ రవిశాస్త్రి మండిపడ్డారు. ఆ స్థానంలో జహీర్ ఖాన్‌ను కాకుండా గతంలో టీమిండియాకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన భరత్ అరుణ్‌ను నియమించాలని ఆయన కోరుతున్నారు. ఈ రోజు రవిశాస్త్రి మీడియాతో మాట్లాడుతూ... జహీర్ ఖాన్ మంచి బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదని, అయితే, టీమిండియా బౌలింగ్ కోచ్‌గా పనిచేయడానికి ఆయనకు అనుభవం లేదని పేర్కొన్నారు. అనుభవం లేని వ్యక్తి అనిల్ కుంబ్లేను టీమిండియా కోచ్‌గా తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పటికే చూశామని వ్యాఖ్యానించారు.
జహీర్ ఖాన్ ఏడాదిలో 250 రోజులు పనిచేయాల్సి ఉంటుందని, అలా పనిచేయడానికి ఆయనకు సాధ్యపడుతుందా? అని రవిశాస్త్రి అడిగారు. భరత్ అరుణ్ కి మాత్రం విదేశాల్లో అపార అనుభవం ఉందని చెప్పారు. ఒకవేళ జహీర్‌కి బౌలింగ్ కోచ్‌గా పనిచేసే ఉద్దేశం ఉంటే భరత్ అరుణ్‌తో కలిసి సలహాదారుడిగా ఉండాలని అన్నారు. అంతేగాక, టీమిండియా బౌలింగ్ కోచ్‌గా జహీర్‌ను నియమిస్తూ జహీర్ ఖాన్ ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున తన బాధ్యతలనుంచి తప్పుకోవాల్సి ఉంటుందని, దీంతో బీసీసీఐ పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.