: త్వరలోనే పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి శశికళ తరలింపు!
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న అన్నాడీఎంకే నాయకురాలు శశికళను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి వేరే జైలుకి తరలించనున్నారు. జైలులో శశికళకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పలు వసతులు కల్పిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కర్ణాటక జైళ్లశాఖ డీజీపీ హెచ్‌ఎన్ సత్యనారాయణరావు కూడా లంచం తీసుకున్నారని జైళ్లశాఖ డీఐజీ రూప తెలిపిన వివరాల మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. దీంతో శశికళను ఆ జైలు నుంచి మరో జైలుకి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.