: 'రానా మ‌రీ ఇంత నిశితంగా ఏం చూస్తున్నాడో కనిపెట్టగలరా?' అంటున్న సురేష్ ప్రొడ‌క్ష‌న్స్


యువ నటుడు రానా, దర్శకుడు తేజల కాంబినేషన్‌లో సురేష్ ప్రొడక్షన్స్, బ్లూప్లానిట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. బాహుబ‌లి-2లో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించిన రానా న‌టిస్తోన్న త‌దుప‌రి చిత్రం ఇదే కావ‌డంతో ఈ సినిమాపై అంచనాలు అధికంగానే ఉన్నాయి.

 కాగా, ఈ రోజు సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ త‌మ ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ఫొటో పోస్టు చేసి ఓ ప్ర‌శ్న‌ను అభిమానుల ముందు ఉంచింది. ఆ ఫొటోలో రానా దేన్నో త‌దేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ జోగేంధ్ర (రానా) ఇంత ఆత్రుత‌గా దేన్ని చూస్తున్నాడో ఊహించ‌గ‌ల‌రా? అని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ అడిగింది. దానికి అభిమానులు ర‌క‌ర‌కాల స‌ర‌దా జ‌వాబులు ఇస్తున్నారు. ఈ సినిమాలో విల‌న్ పాత్ర పోషించే నటుడు త‌న‌కు త‌గిన విధంగా న‌టించ‌డం లేద‌ని, కొన్ని స‌న్నివేశాలు మ‌ళ్లీ తీయాల‌ని చెబుతున్నాడ‌ని కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్ కోసం చూస్తున్నాడ‌ని మ‌రికొంద‌రు చమత్కరిస్తున్నారు. 

  • Loading...

More Telugu News