: అమర్ నాథ్ దాడిపై దియా మీర్జా ట్వీట్... నెటిజన్ల మండిపాటు!
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు ఇటీవల జరిపిన దాడిలో అమర్ నాథ్ యాత్రికులు ఏడుగురు చనిపోవడం తెలిసిందే. ఈ సంఘటనను రాజకీయనాయకులు, క్రికెటర్లు, సినీతారలు ఖండించారు. తాజాగా, బాలీవుడ్ నటి దియా మీర్జా ఈ ఘటనపై స్పందిస్తూ, 1850లో బుటా మాలిక్ అనే ముస్లిం మతపెద్ద అమర్ నాథ్ పుణ్యక్షేత్రాన్ని గుర్తించారని, ప్రేమ, గౌరవం, ఐకమత్యానికి గుర్తు మనదేశం అని తన ట్వీట్ లో పేర్కొంది. అయితే, నెటిజన్లు మాత్రం ఈ ట్వీట్ పై మండిపడుతున్నారు. అమర్ నాథ్ పుణ్యక్షేత్రాన్ని గుర్తించిన వ్యక్తి ముస్లిం అని చెప్పిన దియా, రెచ్చగొట్టేలా మాట్లాడుతోందంటూ ఆయా ట్వీట్లలో విరుచుకుపడ్డారు.