: వైద్యం కోసం స్వయంగా ఆస్పత్రికి వెళ్లిన కోతి!


పెంపుడు జంతువులు అనారోగ్యం పాలైతే వాటిని పెంచుకునే యజమానులు వాటికి వైద్యం చేయిస్తారు. అంతేకానీ ఏ జంతువూ త‌న‌కు తానుగా ఆసుప‌త్రికి వెళ్ల‌లేదు. అయితే, ఉత్తరాఖండ్‌లో మాత్రం ఓ కోతి త‌న‌కు తానుగా ఆసుప‌త్రికి వెళ్లి చికిత్స చేయించుకుంది. డెహ్రాడూన్‌లోని ఓ ఆసుప‌త్రికి వెళ్లిన ఆ కోతి అక్క‌డ ఆ స‌మ‌యానికి వైద్యుడు లేక‌పోవ‌డంతో టేబుల్‌పై కూర్చుంది. వైద్యుడి టేబుల్‌పైనే కాసేపు పడుకుంది. అక్కడే ఉన్న సెలైన్‌ తీసుకుని నీళ్ల‌లా తాగేసింది.

అనంత‌రం ఓ న‌ర్సు అక్క‌డికి వ‌చ్చింది. ఆ నర్సును చూసిన కోతి త‌న పొట్ట‌ను చూపించింది. దాని పొట్ట‌లో ఏదో స‌మ‌స్య ఉన్న‌ట్లు గ‌మ‌నించిన ఆ న‌ర్సు దానికి ఓ సెలైన్‌ బాటిల్ ఇచ్చింది. ఆ సెలైన్ బాటిల్‌ను తాగిన ఆ కోతి అనంత‌రం అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. అక్క‌డి వ్య‌క్తులు దానికి అర‌టిపండు ఇవ్వాల‌ని చూశారు. కానీ, ఆ కోతి తీసుకోలేదు. ఈ విచిత్ర ఘ‌ట‌న‌ను చూసిన ఆసుప‌త్రిలోని వ్య‌క్తులు ఆశ్చ‌ర్య‌పోయారు.     

  • Loading...

More Telugu News