: నా కూతుర్ని పోకిరి ఏడిపిస్తున్నాడు, చర్యలు తీసుకోండంటే పోలీసులేమన్నారో చూడండి...!
వేధింపులకు పాల్పడే వారిపై పోలీసుల తీరు ఎలా ఉంటుందో తెలిపే ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... రొద్దం మండలం పెద్దగువ్వలపల్లికి చెందిన ముస్లిం యువతిని ఎం.కొత్తపల్లికి చెందిన వ్యక్తికిచ్చి వివాహం చేశారు. వివాహానంతరం రెండు నెలలుగా ఓ ఆగంతుకుడు తన కుమార్తెకు ఫోన్ చేసి అభ్యంతరకరంగా మాట్లాడుతూ వేధిస్తున్నాడని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వెంటనే వివరాలు నమోదు చేసుకుని వేధింపుల పోకిరీని అదుపులోకి తీసుకోవాల్సిన పోలీసులు...'అయితే, ఫోన్ నెంబర్ మార్చేయండి' అంటూ ఉచిత సలహా పారేశారు. అక్కడే వున్న ఒక మహిళా పోలీసు అయితే... తనను కూడా పోకిరీలు వేధిస్తున్నారని, మరి తానేం చేయాలని ఫిర్యాదీని ప్రశ్నించి అవాక్కయ్యేలా చేసింది. దీంతో ఆయన చేసేదేమీ లేక ఆవేదనతో ఇంటికి చేరాడు.