: అలాంటి పని నేను, సమంత చేయం.. నాన్న ఎంతో బాధపడతారు: నాగచైతన్య
సెలబ్రిటీ లవ్ బర్డ్స్ నాగచైతన్య, సమంతలు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. అక్టోబర్ 6వ తేదీని వీరి వివాహం జరగనుంది. వీరి పెళ్లి గోవా, హైదరాబాదుల్లో ఘనంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో, ఓ వార్త హల్ చల్ చేస్తోంది. పెళ్లి ఖర్చులను నాగచైతన్య, సమంతలే పెట్టుకోవాలని అనుకుంటున్నారనేదే ఆ వార్త. ఈ గాసిప్స్ పై చైతూ స్పందించాడు. పెళ్లి అనేది రెండు కుటుంబాలు ఎంతో ఆనందంగా జరుపుకునే ఓ వేడుక అని... అలాంటిది తమ పెళ్లికి తామే ఖర్చులు పెట్టుకోవాలని తాము ఎందుకు అనుకుంటామని ప్రశ్నించాడు. ఇలాంటి ఆలోచనను చెప్పినా తన తండ్రి ఎంతో బాధపడతారని అన్నాడు. అలాంటి పని తాను, సమంత చేయబోమని తెలిపాడు. ఇరు కుటుంబాలు కలసి తమ పెళ్లిని ఘనంగా నిర్వహిస్తాయని చెప్పాడు.