: గండం గట్టెక్కిన గజరాజు... నేవీ అధికారులకు థ్యాంక్స్... వీడియో చూడండి
నీళ్లలో పడి మునిగిపోతున్న గజరాజును విష్ణుమూర్తి రూపంలో వచ్చి రక్షించారు శ్రీలంక నావికా దళ అధికారులు. ఎలా వెళ్లిందో ఏమో హిందూ మహాసముద్రం లోపలి దాకా వెళ్లిన ఈ ఏనుగు, బయటికి ఎలా రావాలో తెలియక గింజుకుంటోంది. ఆ సమయంలో అటుగా వెళ్తున్న నావికా దళ అధికారులు 12 గంటల పాటు శ్రమించి దాన్ని రక్షించారు. వాళ్లు ఏనుగును రక్షించిన వీడియో ఇప్పుడు బయటికి వచ్చింది.
ఏనుగులు ఎక్కువగా సంచరించే శ్రీలంకలో కొక్కిలాయి లగూన్ ప్రాంతంలో సముద్రం దాటుతుండగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. మామూలుగా సముద్రంలో తక్కువ లోతు ఉండే ప్రాంతాల గుండా ఏనుగులు దాటుతాయి. అలా దాటుతుండగా అలల తాకిడికి ఈ ఏనుగు ఇక్కడి దాక వచ్చి ఉండవచ్చని వారు అంచనా వేశారు. అతి కష్టం మీద ఏనుగును కాపాడిన అధికారులు దాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అప్పగించారు.