: విశాఖ జిల్లాలో జబర్దస్త్ యాంకర్ రష్మి.. షేక్ హ్యాండ్, సెల్ఫీల కోసం ఎగబడ్డ అభిమానులు!


జబర్దస్త్ యాంకర్, నటి రష్మి విశాఖ జిల్లాలో సందడి చేసింది. నర్సీపట్నం లోని శారదానగర్ లో ఉన్న అమ్మ షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన మై స్టోర్ డిపార్ట్ మెంటల్ సూపర్ మార్కెట్ ను ఆమె ప్రారంభించింది. ఈ సందర్భంగా రష్మిని చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు షేక్ హ్యండ్ ఇచ్చేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మాల్ వద్దకు వచ్చిన తర్వాత, కారు దిగే అవకాశం కూడా ఆమెకు రాలేదు. దీంతో, పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం, తొలి కొనుగోలును రష్మి చేసింది.

  • Loading...

More Telugu News