: బాలయ్య సినిమాకు ఛార్మికి జీతమిచ్చారా? రెమ్యూనరేషనా?
తెలుగులో కొంత కాలం పాటు టాప్ హీరోయిన్లలో ఒకరుగా వెలిగిన ఛార్మి చేతిలో ఇప్పుడు సినిమా అవకాశాలు లేవు. దీంతో పూరీ జగన్నాథ్ కు సంబంధించిన 'పూరీ కనెక్ట్స్' సంస్థకు ఆమె సీఈవోగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాధ్ తో కలిసి బాలకృష్ణ చేస్తున్న ‘పైసా వసూల్’ సినిమాకు ఆమెకు రెమ్యూనరేషన్ భారీగా ముట్టిందని, సినిమాల్లో పడే కష్టం కంటే ఇదే బాగున్నట్టుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను ఛార్మి అందుకుందని ప్రచారం జరిగింది.
అయితే, ఈ సినిమా నిర్మాణమే మొత్తం 25 కోట్ల రూపాయల్లో జరిగితే, తనకు 4 కోట్ల రెమ్యూనరేషన్ ఎవరు ఇచ్చారని ఛార్మి వాపోతోందట. ఏమైనా, ఒకప్పుడు భారీ రెమ్యూనరేషన్ తీసుకుని సినిమాల్లో నటించిన ఛార్మీ... ఇప్పుడిలా జీతానికి పని చేయడంపై ఆమె అభిమానులు మాత్రం అప్సెట్ అవుతున్నారట!