: ల్యాండింగ్ సమయంలో ఎయిర్ కెనడా విమానానికి తప్పిన ప్రమాదం!


అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్‌ కెనడా విమానానికి పెద్ద  ప్రమాదం తప్పింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు.. గత వారం ఎయిర్‌ కెనడాకు చెందిన ఎయిర్‌బస్‌ ఏ 320 విమానం ల్యాండ్‌ అయ్యేందుకు శాన్‌ప్రాన్సిస్కో విమానాశ్రయంలోని రన్‌వే-28ను కేటాయించారు. అయితే, సంబంధిత రన్ వేపై కాకుండా ట్యాక్సీ వే ప్రాంతంలో ఆ విమానాన్ని దింపేందుకు పైలట్ యత్నించాడు.

ఈ విషయం గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు తక్షణం స్పందించి సదరు పైలట్ ను అప్రమత్తం చేశారు. లేకపోతే, పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. ఎందుకంటే, టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న నాలుగు విమానాలు అప్పటికే ట్యాక్సీ వే ప్రాంతంలో ఉన్నాయి. సుమారు 135 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఎయిర్ కెనడా విమానంలో ఉన్నారు. కాగా, ఈ ఘటనపై అమెరికా ఏవియేషన్‌ అధికారులు విచారణ చేపట్టారు.  

  • Loading...

More Telugu News