: రోజా ప్రతి రోజూ మందు తాగడం ముందు మానేయాలి.. ఆ తర్వాత మాట్లాడాలి: మంత్రి అమరనాథ్ రెడ్డి
'ఏపీ మంత్రులంతా మందుబాబులే' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మంత్రి అమరనాథరెడ్డి మండిపడ్డారు. ప్రతి రోజూ మందు తాగడాన్ని రోజా ముందు ఆపేయాలని... ఆ తర్వాత వేరే వారి గురించి మాట్లాడాలని అన్నారు. గత ఎన్నికల్లో రుణమాఫీని వ్యతిరేకించిన జగన్ ను రైతులెవరూ నమ్మరని చెప్పారు. గత ఎన్నికలప్పుడు జగన్ అతి విశ్వాసంతో ఉన్నారని... ఇప్పుడేమో ఓటమి భయంలో ఉన్నారని అన్నారు. అందుకే సలహాదారులను కూడా నియమించుకున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా... టీడీపీని ఏమీ చేయలేరని తెలిపారు.