: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి నటుడు దిలీప్ ను తొలగించాం: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి


నటి భావనపై లైంగిక వేధింపులు, దాడి కేసులో అరెస్టయిన నటుడు దిలీప్ ను అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) నుంచి తొలగించినట్టు నిన్న వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘అమ్మ’ ప్రధాన కార్యదర్శి, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మాట్లాడుతూ, ఈ అసోసియేషన్ నుంచి దిలీప్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేశామని, ఇటువంటి వ్యక్తులను ‘అమ్మ’ ప్రోత్సహించదని, అందరి కోసం ‘అమ్మ’ పనిచేస్తుందని చెప్పారు. ‘సోదరి భావనకు మొదటి నుంచి మద్దతుగానే నిలిచాం. మా మద్దతు ఆమెకు ఎప్పుడూ ఉంటుంది’ అని మమ్ముట్టి చెప్పారు.     

  • Loading...

More Telugu News