: సినిమా ఫంక్షన్ నుంచి ఏడుస్తూ వెళ్లిపోయిన బాలీవుడ్ నటి!


ప్రముఖ బాలీవుడ్ నటి దివ్యా దత్తాకు చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, 'బాబూమోషాయ్ బందూక్ బాజ్' అనే చిత్రం ట్రైలర్ నిన్న విడుదలైంది. ఈ సినిమాలో దివ్యా దత్తా కీలకపాత్ర పోషించింది. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి దివ్య, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు హాజరయ్యారు. చిత్ర బృందం అంతా స్టేజిపైకి వెళ్లిపోయింది. దివ్యాదత్తాను మాత్రం స్టేజి పైకి ఎవరూ పిలవలేదు. ఆమె ప్రేక్షకుల మధ్యే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో, తీవ్ర ఉద్వేగానికి గురైన ఆమె... చివరకు ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సినిమా యూనిట్ ఆమెకు క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. 

  • Loading...

More Telugu News