: శ్రీలంక క్రికెట్ కు కొత్త కెప్టెన్లు.. లిమిటెడ్ ఓవర్లు, టెస్టులకు వేర్వేరుగా!
అత్యంత బలహీనమైన జింబాబ్వేతో స్వదేశంలో సిరీస్ కోల్పోవడాన్ని శ్రీలంక క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు, ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా తప్పుకున్నాడు. దీంతో, అత్యవసరంగా సమావేశమైన శ్రీలంక క్రికెట్ బోర్డు నేడు కొత్త కెప్టెన్లను ప్రకటించింది. టెస్టులకు దినేష్ చండిమల్ ను కెప్టెన్ గా నియమించింది. వన్డే, టీ20లకు ఉపుల్ తరంగను కెప్టెన్ గా ప్రకటించింది. జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టు నుంచి కెప్టెన్ గా చండిమల్ బాధ్యతలను చేపట్టనున్నాడు. వీరిద్దరి సారథ్యంలోనే స్వదేశంలో భారత్ తో జరగనున్న 3 టెస్టులు, 5 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ లను శ్రీలంక ఆడనుంది.