: తాగి గొడవ చేసిన నటుడు ఫిష్ వెంకట్... కేసు నమోదు
సినిమాల్లో విలన్ పక్కన చిన్న చిన్న వేషాల్లో కనిపించే నటుడు ఫిష్ వెంకట్‌పై భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అర్థరాత్రి తాగి వచ్చి ఒక ఇంటిపై గొడవకు వెళ్లినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. కొత్తగూడెంలోని ఏ పవర్‌హౌజ్ ప్రాంతంలో నివాసముండే తన కుమార్తె ఇంటి పక్కన ఉండే వేముల ప్రసాద్, ఉపేంద్ర, రాజేశ్‌లపై ఫిష్ వెంకట్ దాడి చేయబోయాడు.
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇంతకుముందు కూడా కొంతమంది మనుషులతో వచ్చి వారి కుటుంబంపై దాడికి ప్రయత్నం చేసినట్టు, పోలీసులు ఎన్ని సార్లు మందలించినా ఫిష్ వెంకట్ తాగి వచ్చి, తమ తల్లిని దూషించేవాడని వేముల ప్రసాద్ వివరించారు.