: మ‌హిళ‌ల‌కు ఉచిత విద్య‌, హెల్త్‌కార్డ్‌... ఓకే చెప్పిన మంత్రుల బృందం!


జాతీయ పాల‌సీ విధానంలో భాగంగా మ‌హిళ‌ల‌కు ఉచిత విద్య‌, వైద్య స‌దుపాయాలు అందించే ప్ర‌తిపాద‌న‌ల‌కు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నాయక‌త్వంలో స‌మావేశ‌మైన మంత్రుల బృందం నేష‌న‌ల్ పాల‌సీ ఫ‌ర్ విమెన్‌, 2017 ముసాయిదా త‌యారు చేశారు. ఉచిత విద్య‌, హెల్త్ కార్డుతో పాటు సాధార‌ణ నేరాల కింద అరెస్టై మూడో వంతు శిక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న పేద మ‌హిళ‌ల‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని ప్ర‌తిపాదించిన‌ట్లు మ‌హిళా శిశు సంక్షేమ శాఖ ప్ర‌తినిధి తెలిపారు.

త్వ‌ర‌లోనే ఈ ముసాయిదాను కేబినేట్ ఆమోదానికి పంపించ‌నున్నారు. విదేశాంగ మంత్రి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఆర్థిక, వ్య‌వ‌సాయ‌, మాన‌వ వ‌న‌రుల శాఖల మంత్రుల‌తో పాటు ఈ బృందంలో మొత్తం 11 మంది ఉంటారు.

  • Loading...

More Telugu News