: `లై` టీజర్ విడుదల
`లై - లవ్, ఇంటెలిజెన్స్, ఎన్మిటీ` టైటిల్‌తో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం టీజర్ విడుదలైంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ హీరో అర్జున్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. ప్రేమ, తెలివితేటలు, శత్రుత్వం అంశాల చుట్టూ తిరిగే ఈ కథను గ్రాండ్‌గా తీసినట్టు టీజర్‌లో కనిపిస్తోంది. గడ్డంతో కనిపిస్తున్న నితిన్ గెటప్, విలన్‌గా అర్జున్ లుక్‌కి ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. టీజర్‌లో వినిపించిన డైలాగ్ కూడా కొత్తగా వుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మేఘ ఆకాశ్ నటిస్తోంది.