: హైదరాబాద్ లో పాకిస్థాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన విద్యార్థులు
జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో నిన్న రాత్రి అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసి ఏడుగురి ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల ఘాతుకాన్ని ఖండిస్తూ హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు పాకిస్థాన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమం ఏబీవీపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట జరిగింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ భారత్‌ను దెబ్బతీయాలనుకుంటున్న పాకిస్థాన్ తీరు పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.