: వచ్చే ఎన్నికల నాటికి జగన్ ఏ అంశంలోనూ టీడీపీతో పోటీ పడలేరు: సీఎం చంద్రబాబు


2019 ఎన్నికల నాటికి జగన్ ఏ అంశంలోనూ టీడీపీతో పోటీ పడలేరని, ప్రజల్లో సంతృప్తి స్థాయిని మరింత పెంచుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఈ రోజు ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ, అమరావతి రాజధాని నిర్మాణానికి ఎటువంటి నిధుల కొరత లేదని, ప్రాథమిక సౌకర్యాల కల్పనకు రూ.50 వేల కోట్లను రాబోయే రోజుల్లో ఖర్చు చేస్తామని, ప్రపంచ బ్యాంక్ రుణ విడుదల షెడ్యూల్ ప్రకటించిందని చెప్పారు.

హడ్కో నుంచి రూ.7500 కోట్ల రుణం, ఆంధ్రా బ్యాంకు, జపాన్ సంస్థ జైకా రుణం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. 2019 ప్రారంభానికి రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తవుతుందని, అమరావతిలో అంతర్జాతీయ విద్యా సంస్థలను నెలకొల్పుతున్నామని, అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయని, పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు నీటిని నిలిపి వాటర్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News