: యాత్రికులపై దాడికి పాల్పడింది ‘లష్కరే’నే.. ఉగ్రవాది ఫొటో విడుదల చేసిన భద్రతా బలగాలు!


జమ్మూకశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రికులపై దాడికి పాల్పడింది తాము కాదంటూ లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రకటనను ఖండిస్తూ జమ్మూకశ్మీర్ భద్రతా బలగాలు మరోప్రకటన చేశాయి. ఈ దాడికి వ్యూహ రచన చేసింది అబూ ఇస్మాయిల్ అనే పాక్ ఉగ్రవాది అంటూ, అతని ఫొటోను విడుదల చేసింది. ఈ మేరకు కశ్మీర్ ప్రధాన పోలీసు అధికారి మునీర్ ఖాన్ ఓ వార్తా సంస్థకు తెలిపారు.

ఉగ్రవాది ఇస్మాయిల్ సహా ముగ్గురు ఈ దాడికి పాల్పడ్డారని అన్నారు. కాగా, ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అంతటా విశ్వహిందూ పరిషత్‌కు చెందిన కార్యకర్తలు, జమ్ముకశ్మీర్‌ నేషనల్‌ పాంథర్స్‌ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌ పార్టీ ఈ రోజు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇదిలా ఉండగా, ఈ దాడిని ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఈ రోజు ఓ లేఖ రాశారు. 

  • Loading...

More Telugu News