: రాజ్ నాథ్ సింగ్ నివాసం ఎదుట మన్మోహన్ సింగ్ కారుకు ప్రమాదం
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రయాణిస్తున్న కారుకు ఈ ఉదయం స్వల్ప ప్రమాదం జరిగింది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసం ఎదుటే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ఉదయం విపక్ష పార్టీలన్నీ కలసి ఉపరాష్ట్రపతి పదవికి యూపీఏ తరఫున ఎవరిని నిలపాలన్న అంశంపై చర్చించేందుకు సమావేశం కావాలని నిర్ణయించగా, అందులో పాల్గొనేందుకు మన్మోహన్ సింగ్ కూడా బయలుదేరారు. ఆయన కాన్వాయ్ లోని మరో కారు అదుపు తప్పి మన్మోహన్ సింగ్ ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.