: బొల్లినేని ఎఫెక్ట్... మినర్వా గ్రాండ్ పై ఫుడ్ కంట్రోల్ దాడులు


ఈ ఉదయం విజయవాడలోని మినర్వా గ్రాండ్ హోటల్ లో తాను అల్పాహారం తింటున్నప్పుడు పూరీలో పురుగులు రావడంపై నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే, టీడీపీ నేత బొల్లినేని రామారావు చేసిన ఫిర్యాదుతో ఫుడ్ కంట్రోల్ అధికారులు కదిలారు. తాను హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని రామారావు అధికారులకు చెప్పారు. ఆపై హోటల్ కు చేరుకున్న ఫుడ్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు. అన్ని ఆహార పదార్థాల శాంపిళ్లను సేకరించారు. వీటిని ల్యాబ్ కు పంపనున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News