: రూ. 10 కోట్లు రెడీ అన్న ఆళ్ల ... వెంటనే ఏపీ ప్రభుత్వానికి కట్టాలని ఆదేశించిన కోర్టు!


సదావర్తి భూముల విషయమై, కోర్టు సూచించిన విధంగా తాను రూ. 10 కోట్లు సిద్ధం చేసుకున్నానని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలుగు రాష్ట్రాల హైకోర్టుకు తెలిపారు. ఈ కేసు నేడు విచారణకు రాగా, గతంలో వేలంలో వచ్చిన సొమ్ముకు రూ. 5 కోట్లను అదనంగా ఇస్తామని, తొలి విడతగా రూ. 10 కోట్లు చెల్లించేందుకు తన క్లయింటు అంగీకరిస్తున్నారని ఆళ్ల తరఫు న్యాయవాది తెలిపారు. ఇక, ఆ డబ్బును దేవాదాయ శాఖకు ఇవ్వాలని, డబ్బు చెల్లించినట్టు ఆ శాఖ కమిషనర్ నుంచి రశీదు తీసుకుని తమకు ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News