: అంబానీ అత్యంత ఖరీదైన నివాసం.. ‘అంటీలియా’లో అగ్ని ప్రమాదం!
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ సంస్థ అధినేత ముఖేశ్ అంబానీ అత్యంత ఖరీదైన నివాసం ‘అంటీలియా’లో అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని అల్టామౌంట్ రోడ్డులో ఉన్న ‘అంటీలియా’లోని తొమ్మిదో అంతస్తులోని టెర్రస్ పై చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి, సమీపంలోని 4జీ సెల్ టవర్ కు వ్యాపించాయి. దీంతో అంబానీ కుటుంబ సభ్యులు ఫోన్ చేయడంతో వేగంగా స్పందించిన ఫైర్ సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ భవనాన్ని 2010లో ముఖేష్ అంబానీ నిర్మించారు. ఈ భవనం బహిరంగ మార్కెట్ లో 2 బిలియన్ డాలర్ల విలువ ఉంటుందని అంచనా.