: సినీ నటి భావన లైంగిక వేధింపుల కేసు... కథ, స్క్రీన్ ప్లే సమకూర్చింది దిలీప్, కావ్యమాధవన్ జంట!


ప్రముఖ సినీ నటి భావన లైంగిక వేధింపుల కేసు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 17న సినిమా షూటింగ్ ముగించుకున్న భావనను డ్రైవర్ పల్సర్ సునీ కిడ్నాప్ చేసి, కార్పొరేటర్ ఇంటికి తీసుకెళ్లి అసభ్య రీతిలో వీడియో తీసి లైంగికంగా వేధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పల్సర్ సునీని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు వారాల క్రితం ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ ను విచారించారు.  అనంతరం నిన్న పోలీసులు దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు.

వాస్తవానికి భావన లైంగిక వేధింపుల ఘటనకు దిలీప్ వివాహం నాడే స్కెచ్ రెడీ అయిందని పోలీసులు గుర్తించారు. 24 నవంబర్ 2016లో దిలీప్, కావ్య మాధవన్ ల వివాహం జరిగింది. ఆ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భావన.... దానికి హాజరు కాలేదు సరికదా, తీవ్ర వ్యాఖ్యలు చేసిందని వార్తలు వెలువడ్డాయి. దీంతో నొచ్చుకున్న దంపతులు భావనపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటే తామే చేశామన్న విషయం తెలిసిపోతుందని సుదీర్ఘ కాలం వెయిట్ చేశారు. ఒక కార్పొరేటర్ ను కిరాయికి మాట్లాడుకుని పల్సర్ సునీతో కథ నడిపించారని పోలీసులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో దిలీప్ ను విచారించి, అతని కార్యాలయంలో దాడులు నిర్వహించి, అతని హస్తముందని నిర్థారించుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.  

  • Loading...

More Telugu News