: నాలుగు కళ్లతో మూడు ముఖాలు.. ‘విఠలాచార్య’ ఫస్ట్ లుక్ కు టాలీవుడ్ యంగ్ హీరోలు ఫిదా
సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్ నటిస్తోన్న రెండవ సినిమా 'విఠలాచార్య' ఫస్ట్‌లుక్ ఈ రోజు విడుదలైంది. నాలుగు కళ్లలో మూడు ముఖాలు చూపిస్తూ నవీన్ ఈ ఫస్ట్‌లుక్‌లో కనపడిన తీరు అద్భుతంగా ఉందని సినీ ప్రముఖులు, అభిమానులు పేర్కొంటున్నారు. టాలీవుడ్ యువనటులు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, సందీప్ కిషన్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి ఫిదా అయిపోయారు. నవీన్ కొత్త సినిమా లుక్ అద్భుతంగా ఉందని, ఆల్ ది బెస్ట్ చెబుతున్నామని పేర్కొన్నారు. విఠలాచార్య చిత్రానికి సుహాస్ మీరా దర్శకత్వం వహించనుండగా, అనీషా ఆంబ్రోస్ కథానాయికగా నటిస్తోంది.