: జగన్ సీఎం అయితే, వీధికో రౌడీ తయారవుతారు: తులసిరెడ్డి విమర్శలు


పొరపాటున జగన్ సీఎం అయితే కనుక వీధికో రౌడీ తయారవుతారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ సీఎం కావాలనే కోరిక పగటికలగానే మిగిలిపోతుందని, అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ ఈ వ్యవహారంలో ఏమవుతాడో ఆయనకే తెలియదని, ఒకవేళ కేసుల నుంచి బయటపడ్డా, ప్రజాకోర్టు నుంచి జగన్ తప్పించుకోలేరని అన్నారు. ఏమీ కాకముందే జగన్ మహాసామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని తులసిరెడ్డి విమర్శించారు.

  • Loading...

More Telugu News