: ఆంత్రాక్స్ వ్యాపిస్తుందనే భయంతో చేతి వేలిని నరికేసుకున్న గిరిజనుడు
విశాఖ ఏజెన్సీలో దారుణం జరిగింది. ఆంత్రాక్స్ వ్యాధి వ్యాపిస్తుందనే భయంతో ఓ గిరిజనుడు తన చేతి వేలిని నరికేసుకున్నాడు. అరకులోయ మండలం పద్మాపురానికి చెందిన గిరిజనుడు ఈ పనికి పాల్పడ్డాడు. వెంటనే, అరకులోయ ఆసుపత్రికి అతన్ని తరలించారు. కాగా, విశాఖ ఏజెన్సీలో ఆంత్రాక్స్ కేసుల సంఖ్య 20కి పెరిగింది. అరకులోయ మండలం కోడిపుంజువలస గ్రామంలో ఐదుగురికి ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్టు కొన్ని రోజుల క్రితం గుర్తించిన విషయం తెలిసిందే.