: హైద్రాబాద్‌ను హెరిటేజ్ న‌గ‌రంగా గుర్తించాలి: అస‌దుద్దీన్ ఓవైసీ!


హెరిటేజ్ న‌గ‌రానికి ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ హైద్రాబాద్‌కు ఉన్నందువ‌ల్ల అహ్మ‌దాబాద్‌తో పాటు హైద్రాబాద్‌ను కూడా హెరిటేజ్ న‌గ‌రంగా గుర్తించేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని కేంద్ర మంత్రి బండారు ద‌త్తాత్రేయ‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ల‌ను ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ కోరారు. హైద్రాబాద్‌లోని 7 టూమ్స్ వ‌ద్ద ద‌క్క‌న్ పార్క్ ఆవిష్క‌ర‌ణ వేడుక‌లో అస‌దుద్దీన్‌, కేటీఆర్‌, ద‌త్తాత్రేయ‌లు పాల్గొన్నారు.

ఈ వేడుక‌లో భాగంగా హైద్రాబాద్‌ను హెరిటేజ్ న‌గ‌రంగా గుర్తించేందుకు మ‌ద్దతివ్వాల‌ని టీఆర్ఎస్, బీజేపీ పార్టీల‌ను ఆయ‌న కోరారు. ఈ విష‌యాన్ని త‌ర్వాత ఆయన ట్వీట్ కూడా చేశారు. అందుకు రిప్లైగా కేటీఆర్ స్పందిస్తూ `త‌ప్ప‌కుండా ప్ర‌య‌త్నిస్తాం` అన్నారు. యునెస్కో వ‌ర‌కు ఈ విష‌యాన్ని తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని బండారు ద‌త్తాత్రేయ హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News