: పాకిస్థాన్ సైనికులపై ఉగ్రవాదుల దాడి!


పాకిస్థాన్ లో సైనికులే లక్ష్యంగా పేలుడు సంభవించింది. ఓ రిజర్వాయర్ నుంచి రక్షణ సిబ్బంది నీటిని తీసుకొస్తుండగా ఉగ్రవాదులు ఐఈడీ బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు మృతి చెందగా... మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాయవ్య పాకిస్థాన్ లో ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వద్ద ఖుర్రం ఏజెన్సీ చెక్ పోస్టు వద్ద ఈ ఘటన చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు రక్షణ సిబ్బంది రంగలోకి దిగారు. అయితే, పేలుడుకు తామే బాధ్యత వహిస్తున్నట్టు ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించుకోలేదు.

  • Loading...

More Telugu News