: ప్యారిస్ లో భారీ వర్షాలు... పలు మెట్రో స్టేషన్ల మూసివేత!


భారీ వర్షాల కారణంగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అతలాకుతలం అయింది. నిన్న రెండు గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ధాటికి 15 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఈ ఉదయం మళ్లీ వాటిని పునరుద్ధరించారు. వర్షం కారణంగా 24 గంటల పాటు 'ఆరంజ్ అలర్ట్' ప్రకటించినట్టు జాతీయ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం పలు శాఖలకు చెందిన సేవలను పునరుద్ధరించే పనులు జరుగుతున్నాయి. ఒక్క రాత్రే 1700 ఎమర్జెన్సీ కాల్స్ వచ్చాయని... వాటిలో 87 కేసులను పరిష్కరించామని అధికారులు తెలిపారు. వీటిలో వరద నీటిని పంపింగ్ చేయడం గురించే ఎక్కువ కాల్స్ వచ్చాయని చెప్పారు. 

  • Loading...

More Telugu News