: 100 మంది బాలికలకు అస్వస్థత... ఆసుపత్రికి తరలింపు


కొమ‌రంభీం ఆసీఫాబాద్ జిల్లాలోని కౌటాలలో ఈ రోజు ఉద‌యం క‌స్తూర్భా స్కూల్లో టిఫిన్ తిన్న బాలిక‌లు వాంతులు, క‌డుపునొప్పితో బాధ‌ప‌డ్డారు. సుమారు 100 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో అల‌జ‌డి చెల‌రేగింది. పాఠశాలలో ఫుడ్ ఫాయిజన్ అయిందని గ్ర‌హించిన ఉపాధ్యాయులు వెంట‌నే వారిని ద‌గ్గ‌ర‌లోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న డీఈవో, జిల్లా క‌లెక్ట‌ర్‌ ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

  • Loading...

More Telugu News